: ముఖ్యమంత్రికి అండగా ఉంటాం : శైలజానాథ్
సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది సీఎం కిరణ్ ఒక్కరేనని మంత్రి శైలజానాథ్ అన్నారు. ముఖ్యమంత్రికి తామంతా అండగా నిలుస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సమైక్యాంధ్ర కోసం అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి కూడా వెనుకాడమని హెచ్చరించారు.