: దేవదేవుడికి నేడు పుష్పయాగం
కలియుగ దేవుడు తిరుమల కొండలపై వెలసిన కోనేటి రాయుడికి నేడు అత్యంత వైభవంగా పుష్పయాగం జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 7 టన్నుల పూలు ఆ దేవదేవుడి పాదాలను స్పృశించడానికి సిద్ధమైపోయాయి. పుష్పయాగం ఉన్నందున పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. యాగోత్సవాన్ని టీటీడీకి చెందిన ఎస్వీబీసీ చానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.