: ఈ బ్యాగులు అమ్మాయిలకు రక్షణ కల్పిస్తాయి
అదేంటి, బ్యాగు అమ్మాయిలకు రక్షణ కల్పించడం ఏంటి అనుకుంటున్నారా... అంటే ఈ బ్యాగును ధరించి ఉన్న అమ్మాయిలు తమకు ఏమాత్రం ప్రమాదం జరుగుతుందని భావించినా వెంటనే చుట్టుపక్కల వారికి తెలిసే విధంగా ఈ బ్యాగు అరుస్తుంది. దీంతో అమ్మాయిలు ప్రమాదం నుండి రక్షించబడతారు. ఇలాంటి కొత్తరకం బ్యాగులు వస్తున్నాయి.
చూసేందుకు ల్యాప్‌ట్యాప్ పెట్టుకునే బ్యాక్‌ప్యాక్ తరహా బ్యాగులాగా కనిపించే అర్బన్ బ్రూ అనే ఈ కొత్తరకం బ్యాగులు కేవలం మన వస్తువులను పెట్టుకోవడానికే కాదు... మనల్ని ప్రమాదం నుండి కాపాడేందుకు కూడా ఉపయోగపడతాయట. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ బ్యాగులు చక్కగా ఉపయోయపడతాయట. ఎక్కడ చూసినా మహిళలపై దారుణాలు పెరిగిపోతున్న నేపధ్యంలో అమ్మాయిలు తమకు ఏదైనా ప్రమాదం ఎదురవుతుందని అనిపించినప్పుడు వెంటనే ఈ బ్యాగ్‌కు కుడివైపున ఉన్న బటన్‌ను నొక్కితే చాలు. వెంటనే కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా వినిపించేలా సైరన్ మోగుతుందట. మామూలుగా భుజానికి వేసుకుని, ఇయర్ ఫోన్ల సాయంతో పాటలు వినడానికి కూడా బాగా సౌకర్యంగా ఉండే ఈ కొత్తరకం బ్యాగులు అమ్మాయిలకు బాగా సౌకర్యవంతంగా ఉంటాయట.