: పంజాబ్ లో మోడీ సభలకు భారీ భద్రత
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభలను ఉగ్రవాదులు టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో... పంజాబ్ లో మోడీ పాల్గొననున్న సభలకు భారీ భద్రత కల్పించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. బీహార్ రాజధాని పాట్నా సభలో జరిగిన పేలుళ్లను దృష్టిలో పెట్టుకుని, ఈ ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వచ్చే నెలలో పంజాబ్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు.