: అధికారులతో హోం మంత్రి సబిత సమీక్ష


ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. భద్రత చర్యలపై రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డి, ఇంటలిజెన్స్ ఐజీలు, తదితరులతో సబిత సమీక్ష నిర్వహించారు.

నేడు, రేపు ఉగ్రవాదులు విరుచుకుపడవచ్చని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేయడంతో, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సబిత అధికారులతో చర్చించారు. విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ అధికారులకు మంత్రి సూచించారు. 

  • Loading...

More Telugu News