: తెలంగాణలో సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదు : మంత్రి జానా
దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదామని మంత్రి జానారెడ్డి తెలిపారు. వరంగల్ లో జరుగుతున్న టీ కాంగ్రెస్ కృతజ్ఞత సభలో జానారెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు సంకేతమే సమన్వయ కమిటీ సమావేశమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. సీమాంధ్ర నేతల ఆటలు ఇక సాగవని... తెలంగాణ ఏర్పాటు తథ్యమని జానా తెలిపారు. తెలంగాణలో సీమాంధ్రులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.