: నటి అంజలిని అరెస్టు చేయనున్నారా?
సినీ నటి అంజలికి సినిమా కష్టాలు తప్పేలా లేవనిపిస్తోంది. తమిళ దర్శకుడు కళంజియం చెన్నైలోని సైదాపేట కోర్టులో వేసిన పరువు నష్టం దావా కేసులో అంజలికి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్టు చేస్తారంటూ ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అంజలి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో ఉందని సమాచారం. దాంతో, చెన్నై పోలీసులు అరెస్టు వారెంట్ ను రెండు రోజుల కిందట (గురువారం) రాజోలు పోలీసులకు పంపించినట్లు దర్శకుడు కళంజియం తరపు న్యాయవాది జయప్రకాష్ తెలిపారు. దాంతో, అంజలిని పోలీసులు అరెస్ట్ చేసేలోపు, ఆమే కోర్టుకు హాజరవుతుందని తెలుస్తోంది. గతంలో విచారణకు హాజరుకావాలని కోర్టు పలుమార్లు పంపిన నోటీసులకు అంజలి స్పందించలేదు. దీనిపై ఆగ్రహించిన కోర్టు అంజలికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.