: రాష్ట్ర విభజన రాజకీయ కుట్ర : చంద్రబాబు నాయుడు
రాష్ట్ర విభజన అనేది రాజకీయ కుట్ర అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, తాము ఎదుర్కొంటున్న ప్రతి కష్టానికి కాంగ్రెస్సే కారణమని ప్రజలు ప్రగాఢంగా నమ్ముతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని చంద్రబాబు నాయుడు తెలిపారు.