: సీమాంధ్ర నాయకుల కుట్రలను ఎండగట్టాలి : ఎంపీ గుత్తా


వరంగల్ లో జరుగుతున్న టీ కాంగ్రెస్ కృతజ్ఞత సభలో పలువురు కాంగ్రెస్ నేతలు సీమాంధ్ర నాయకులపై విమర్శలను ఎక్కుపెట్టారు. ఈ సందర్భంగా, అంతర్గత విమర్శలు మాని, సీమాంధ్ర నాయకుల కుట్రలను ఎండగట్టాలని ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎంతగా నష్టపోయారో కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించిందని... అందుకే రాష్ట్ర విభజనకు సిద్ధమైందని ఎంపీ రాపోలు తెలిపారు. సీమాంధ్ర నేతల బాధ ప్రజలకోసం కాదని... హైదరాబాద్ లో వారి ఆస్తులను కాపాడుకోవడానికేనని ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

  • Loading...

More Telugu News