: 'మార్స్ ఆర్బిటర్' కక్ష్య పెంపు
ఈ తెల్లవారుజుమున మార్స్ ఆర్బిటర్ (మామ్) కక్ష్యను మరోసారి పెంచారు. తెల్లవారుజామున 2.10 గంటలకు ఉపగ్రహంలోని 'లిక్విడ్ అపోజీ మోటార్'ను 707 సెకండ్లపాటు మండించి... అపోజీ (కక్ష్యలో భూమికి దూరంగా ఉండే బిందువు)ని 40,186 కిలోమీటర్ల నుంచి 71,636 కిలోమీటర్లకు పెంచారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని మూడు సార్లు నిర్వహించారు. నవంబరు 11, నవంబరు 16న మరో రెండు సార్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అపోజీని లక్ష 92 వేల కిలోమీటర్లకు పెంచుతారు. అనంతరం డిసెంబరు 1న ఉపగ్రహాన్ని అంగారకుడి దిశగా మళ్లిస్తారు.