: వీళ్లతో మాట్లాడటం దండగ.. బొత్స కస్సుబుస్సు
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు మీడియా అంటే చెప్పలేనంత చిరాకు. మీడియా సమావేశం సందర్భంగా చాలా సార్లు ఆయన అన్యాపదేశంగా మీడియా అంటే తనకు ఎంత ఎలర్జీయో బయటపెట్టేస్తుంటారు. తాజాగా ఢిల్లీలో సీఎం మీడియా సమావేశం సందర్భంగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కిరణ్ మీడియాతో మాట్లాడుతుండగా మీడియా ప్రతినిధులు తెలంగాణ, రాష్ట్ర విభజనలపై ప్రశ్నలు సంధించారు. దీంతో మండిన బొత్స 'వీళ్లతో మాట్లాడడం దండగ' అంటూ వ్యాఖ్యానించారు. వివరణ అడిగిన మీడియా ప్రతినిధులకు 'మా సీఎంతో మేం ఏమైనా మాట్లాడుకుంటాం' అని దురుసుగా సమాధానమిచ్చారు. 'మీకేది కావాలంటే అది రాసుకోండి' అని బొత్స ఘాటుగా స్పందించి నిష్క్రమించారు.