: వార్టన్ సదస్సుకు మోడీని ఆహ్వానించాల్సింది: కేంద్ర మంత్రి శశి థరూర్


వార్టన్ ఆర్ధిక సదస్సుకు గుజరాత్ సీఎం నరేంద్ర మోడీని ఆహ్వానించి ఉండాల్సిందని కేంద్ర మంత్రి శశి థరూర్ అభిప్రాయపడ్డారు. సదస్సులో మోడీ చెప్పేది విని ఏవైనా అభ్యంతరాలు ఉంటే తిరిగి ప్రశ్నించడం ద్వారా స్పష్టమైన సమాధానం ఆశించవచ్చని థరూర్ చెప్పారు.

అలా కాకుండా ప్రసంగాన్ని రద్దు చేయడం ద్వారా మోడీ చెప్పే విలువైన విషయాలను వినే అవకాశం కోల్పోయారని వార్టన్ సదస్సు నిర్వాహకులను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతగా తానీ వ్యాఖ్యలు చేయడంలేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని థరూర్ అన్నారు.

కాగా, కొన్ని వారాల క్రితం వార్టన్ సదస్సుకు రమ్మంటూ తనకూ ఆహ్వానం అందిందని, అయితే, పార్లమెంటరీ వ్యవహారాలతో తీరికలేకుండా ఉండడంతో వారి అభ్యర్థనను తిరస్కరించానని థరూర్ వెల్లడించారు. 

  • Loading...

More Telugu News