: విభజనపై దిగ్విజయ్ మాటలు నీటి మీద రాతలే : లగడపాటి
విభజనపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ చెబుతున్న మాటలు నీటి మీద రాతలేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. మా ఇళ్లను మేమే తగల బెట్టుకున్నామని, చక్కదిద్దుకోవడానికి సమయం పడుతుందని పేర్కొన్నారు. ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఒకప్పుడు సమైక్యవాదేనన్న లగడపాటి, తెలంగాణలో పరిస్థితుల దృష్ట్యా దామోదర అలా మాట్లాడుతున్నారని చెప్పారు.