: రెండు వందల కోట్ల క్లబ్బులోకి అడ్డుగుపెట్టిన 'క్రిష్ 3'
భారీ వసూళ్లతో దూసుకుపోతున్న బాలీవుడ్ సీక్వెల్ చిత్రం 'క్రిష్ 3' తాజాగా రూ.200 కోట్ల క్లబ్బులోకి చేరింది. ఈనెల ఏడున ఈ మార్కును దాటిన ఈ చిత్రం మరిన్ని వసూళ్లతో దూసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా 166.52 కోట్లు, ఓవర్ సీస్ ద్వారా 35.90 కోట్లతో కలిపి రూ.202.42 కోట్లు కలెక్ట్ చేసింది. దాంతో, నటుడు అమీర్ ఖాన్ నటించిన 'త్రీ ఇడియట్స్', షారుక్ ఖాన్ చిత్రం 'చెన్నై ఎక్స్ ప్రెస్' సరసన చేరింది. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రాకేష్ రోషన్ తెరకెక్కించారు.