: అమెరికాలో భారతీయ వైద్యుడికి ప్రతిష్ఠాత్మక అవార్డు


అమెరికా ఆరోగ్య రంగానికి అందించిన సేవలకు గాను భారతీయ వైద్యుడు రాహుల్ జిందాల్ కు అవుట్ స్టాండింగ్ అమెరికన్ బై చాయిస్ అనే అవార్డు వరించింది. అమెరికన్ పౌర, వలసవాదుల సేవా విభాగం ఈ నెల 13న రాహుల్ కు ఈ అవార్డును అందించనుంది. స్వదేశంతోపాటు, అమెరికాకు విశేష సేవలు చేసిన వారికి ఈ అవార్డులు అందిస్తుంటారు. రాహుల్ జిందాల్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ లో ట్రాన్స్ ప్లాంట్ సర్జన్ గా, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో క్లినికల్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. రాహుల్ అహ్మదాబాద్ లో ఎండీ వైద్యవిద్యను పూర్తి చేసుకున్నారు. బ్రిటన్ లో ఉన్నత విద్య పూర్తి చేసి అమెరికాలో స్థిరపడ్డారు.

  • Loading...

More Telugu News