: అమెరికాలో పాక్ నూతన రాయబారిగా అబ్బాస్ జిలానీ


అమెరికాలో పాకిస్థాన్ నూతన రాయబారిగా జలీల్ అబ్బాస్ జిలానీని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గత రాత్రి పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిలానీ పాక్ విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. డిసెంబర్ లో జిలానీ రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికాతో బంధం బలపడడానికి, అమెరికా భారత్ కు బాసటగా నిలవకుండా అడ్డుకట్ట వేసేందుకు జిలానీ అనుభవం ఉపయోగపడుతుందని నవాజ్ షరీఫ్ భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News