: కాంగ్రెస్ నేతల మాటలు తెలంగాణను అవమానించేలా ఉన్నాయి: కేసీఆర్


సభ ఏదైనా.. సమయం దొరకాలి గానీ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ వాదనను పదునెక్కిస్తారు. బుధవారం హైదరాబాదులో ఆర్టీసీ కార్మికులు ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. మాట ఇచ్చి తప్పుతూ, కాంగ్రెస్ నేతలు తెలంగాణను అవమానపరుస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నేతలకు మతి భ్రమించింది కాబట్టే తమ ఉద్యమాన్నిఇలా కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 'తెలంగాణ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు, అంతేకానీ, అవహేళన చేసేలా వాయలార్ రవి ఎలా మాట్లాడతారు' అని కేసీఆర్ ప్రశ్నించారు.

ఆర్టీసీ నియామకాల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని ఆరోపించారు. అయితే ఆర్టీసీలో మహిళల పోస్టులను వారికే కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండు చేశారు. తెలంగాణ ఏర్పడితే ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News