: 4 కోట్ల బ్లాక్ మనీ స్వాధీనం
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో పలు వ్యాపారుల నివాసాలపై ఈ ఉదయం ఆదాయపు పన్ను(ఐటీ) శాఖాధికారులు దాడులు చేశారు. ఆ దాడుల్లో 4 కోట్ల రూపాయల నల్ల ధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు కీలక పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పట్టణంలోని బంగారం, వస్త్ర, వడ్డీ వ్యాపారులే లక్ష్యంగా ఐటీ శాఖాధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించని వ్యాపారులను ఉపేక్షించమని అధికారులు వారిని హెచ్చరించారు.