: విరిగిన'పోయిన' ఎముకలను పెంచవచ్చు


ప్రమాదంలో విరిగిపోయిన ఎముకలను తిరిగి పెంచేందుకు కొత్త రకం పద్ధతిని కనుగొన్నారు. విరిగిన ఎముకలను పెంచే బయోప్యాచ్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు. యూనివర్సిటీ ఆఫ్‌ అయోవాకు చెందిన శాస్త్రవేత్తలు చర్మం ముడతలు పడకుండా కాపాడే కొల్లాజెన్‌ సాయంతో ఒక బయోప్యాచ్‌ను తయారుచేశారు. ఈ బయోప్యాచ్‌లో ఎముక నిర్మాణానికి అవసరమైన జన్యు ఆదేశాలను (డిఎన్‌ఏ సాయంతో) చొప్పించడం ద్వారా ఎముకలను పెంచవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పుర్రె ఎముక పగిలిన కొన్ని జంతువుల్లో ఈ బయోప్యాచ్‌ను అమర్చగా వాటిలో పగిలిన భాగం పూర్తిగా పెరిగిందని, గతంలో ఇలాంటి ప్యాచ్‌లను రూపొందించినా వాటికీ, దీనికీ తేడా ఉంటుందని అయోవా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ప్యాచ్‌ను అమర్చిన చోట శరీరంలోపలి కణాలకు అది ఆ ప్రాంతంలో ఎముకను పెంచేలా జన్యు ఆదేశాలను జారీ చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ బయోప్యాచ్‌ ఎముకల పునర్నిర్మాణానికేకాకుండా దంత సమస్యలతో బాధపడేవారికి డెంటల్‌ ఇంప్లాంట్ల అమరికలో సైతం చక్కగా ఉపయోగపడుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన వర్సిటీ గ్రాడ్యుయేట్‌ విద్యార్ధిని శీతల్‌ డి మెల్లో చెబుతున్నారు.

  • Loading...

More Telugu News