: విద్యుత్తును ఇలా కూడా ఉత్పత్తి చేయవచ్చు!


విద్యుత్తు రానున్న కాలంలో చాలా అవసరం. కాబట్టే ఎన్ని విధాలుగా వీలుంటే అన్ని విధాలుగా విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సూక్ష్మ తరంగాలనుండి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రక్రియలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇంటర్నెట్‌కోసం మనం ఉపయోగించే వై-ఫై నుండి సూక్ష్మ తరంగాలు వెలువడతాయి. ఇలాంటి తరంగాలనుండి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అలాగే ఆకాశంలోని భూకక్ష్యలో పరిభ్రమించే కృత్రిమ ఉపగ్రహాలనుండి కూడా ఇలాంటి సూక్ష్మ తరంగాలు వెలువడతాయి. ఇవి గాలిలో అలా వృధాగా కలిసిపోతుంటాయి. వాటిని వృథాగా పోనిచ్చేకన్నా ఒడిసిపట్టి విద్యుత్తుగా మార్చితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిన యూఎస్‌లోని డ్యూక్‌ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ దిశగా ప్రయోగాలు సాగించారు. చివరికి ఒక కొత్త పరికరాన్ని కనుగొన్నారు. ఈ పరికరం గాలిలో ఉండే సూక్ష్మ తరంగాలను విద్యుత్తు తరంగాలుగా మారుస్తుంది. దీనిద్వారా సెల్‌ఫోన్‌ లేదా ఇతరత్రా చిన్నపాటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఛార్జింగ్‌ చేసుకునేందుకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News