: దేవుళ్లకు అవమానం జరిగింది


హిందూ దేవుళ్ల బొమ్మలను బీరు బాటిళ్లపై ముద్రించి ఒక బీరు తయారుచేసే కంపెనీ తమ అమ్మకాలు సాగించింది. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాలోని న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన బ్రూక్‌వేల్‌ యూనియన్‌ అనే బీరు తయారు చేసే కంపెనీ గణేశుని తలను లక్ష్మీదేవి శరీరానికి అతికించి తయారుచేసిన బొమ్మను తాము తయారుచేసే జింజర్‌ బీరు బాటిళ్లపై ముద్రించింది. దీనిపై ఆస్ట్రేలియాలో ఉండే భారతీయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ బీరు బాటిల్‌పై కామధేనువును పోలిన ఆవు, ఇంకా పలు హిందూ మత చిహ్నాలను కూడా ముద్రించి ఉండడం గమనార్హం.

  • Loading...

More Telugu News