: పార్కులో దొరికిందని...
పార్కులో దొరికిందని...అనేది అమెరికా వంటి దేశాల్లో సర్వసాధారణమయిపోతోంది. తరచూ తుపాకీలతో ఆగంతకులు దాడులకు పాల్పడడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే పార్కులో చక్కగా ఆడుకుంటున్న ఒక తొమ్మిదేళ్ల బాబుకి అక్కడ ఒక తుపాకీ దొరికింది. దీంతో దాన్ని జాగ్రత్తగా దాచి, మరునాడు పాఠశాలకు తెచ్చాడు. సహజంగా పిల్లలు తమకు ఏవైనా కొత్తరకం ఆటవస్తువులు లభిస్తే వాటిని తమ స్నేహితులకు చూపించి సంబరపడతారు. తనకు పార్కులో దొరికిన తుపాకీని కూడా తన స్నేహితులకు చూపించాలని సదరు బాలుడు దాన్ని పాఠశాలకు తెచ్చాడు.
ఫ్లోరిడాలోని ఒక పాఠశాలకు చెందిన బాలుడు తన స్నేహితులకు తుపాకీని చూపిస్తుండగా సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా తనకు అది పార్కులో దొరికిందని బాలుడు చెబుతున్నాడట. మరోవైపు బాలుడి తల్లిని విచారించగా అది తనది కాదని చెప్పిందట.