: బంగారం కోసం బాలిక కిడ్నాప్
హైదరాబాద్ లోని పాతబస్తీలో బంగారం కోసం రెండేళ్ల చిన్నారి అక్షయ కిడ్నాప్ కు గురైంది. బాలిక వారం క్రితమే కిడ్నాపైనా ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం పాతబస్తీలో కలకలం రేపుతోంది. కిడ్నాపర్లు 3 కిలోల బంగారం డిమాండ్ చేస్తున్నారని బాధితుల బంధువులు తెలిపారు. కిడ్నాప్ వ్యవహారం బయటకు పొక్కితే చిన్నారి ప్రాణాలకు ప్రమాదమని విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఆలస్యంగా విషయం వెలుగులోకి రావడంతో పాతబస్తీ పోలీసులు అలెర్టయ్యారు. కిడ్నాప్ ను చేధించేందుకు నిపుణులైన పోలీసులతో ఆపరేషన్ మొదలు పెట్టారు.