: ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా 'మన గుడి'


కార్తీక పౌర్ణమి సందర్బంగా ఈ నెల 17న రాష్ట్ర వ్యాప్తంగా 22వేల ఆలయాల్లో 'మన గుడి' కార్యక్రమాన్ని తిరుమల నిర్వహించనుంది. అంతకుముందు తిరుమల నుంచి 'మన గుడి' పూజా సామగ్రి వాహనాలను టీటీడీ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. వైకుంఠం-2 క్యూ కాంప్లెక్సులో అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. దాంతో, భక్తులు బయట కూడా బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 22 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతోంది. ఇవాళ శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.33 కోట్లు.

  • Loading...

More Telugu News