: 14 నుంచి 16 వరకు ఏపీ సైన్స్ కాంగ్రెస్
ఏపీ సైన్స్ కాంగ్రెస్ 2013ను మూడు రోజుల పాటు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ అకాడెమీ ఆఫ్ సైన్స్ అధ్యక్షుడు సీహెచ్ మోహనరావు తెలిపారు. ఈ ఏడాది సైన్స్ కాంగ్రెస్ ను హైదరాబాద్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. సైన్స్ పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించడం, సైన్సు ప్రయోగాల పట్ల విద్యార్థుల్లో ఉన్న ఉత్సాహాన్ని కనిపెట్టి సూచినలివ్వడం సైన్స్ కాంగ్రెస్ ముఖ్యోద్దేశ్యమని ఆయన తెలిపారు. సైన్స్ రంగంలో దేశ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో విద్యార్థులకు ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసి అనుమానాలు నివృత్తి చేస్తున్నామని అన్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకు నిర్వహించే సైన్స్ కాంగ్రెస్ లో 600 మంది విద్యార్థులు పాల్గోనున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యదర్శి టి రామస్వామి కీలక ఉపన్యాసం చేయనున్నారని ఆయన వెల్లడించారు.