: జమ్మూ కాశ్మీర్ ను వణికిస్తున్న చలి..మైనస్ 4 డిగ్రీల ఉష్ణోగ్రత


శీతాకాలం ప్రవేశంలోనే జమ్మూ కాశ్మీర్ వణుకుతోంది. ఒక్కసారిగా సంభవించిన వాతావరణ మార్పులతో లడక్ ప్రాంతం తల్లడిల్లుతోంది. ప్రతి ఏటా డిసెంబర్ లో పలకరించే మైనస్ డిగ్రీల సెంటీగ్రేడ్ హిమపాతం నవంబర్ తొలి వారంలోనే తన ప్రభావం చూపుతోంది. దీంతో లడక్, కుప్వారా జిల్లాల్లో ప్రజల్ని రాత్రులు సంచరించవద్దని భారత భద్రతాదళాలు హెచ్చరించాయి. లడక్ సరిహిద్దు ప్రాంతంలో మైనస్ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ లకు ఉష్ణోగ్రత చేరుకుంటోంది. ఇదే లెక్కన మరిన్ని రోజులు మంచు కురిసే అవకాశం ఉందని ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

  • Loading...

More Telugu News