: అరంగేట్రంలోనే అదరగొట్టారు... రోహిత్, షమి
అరంగేట్రంలోనే ఇద్దరు భారత క్రికెటర్లు అదరగొట్టారు. వన్డేల నుంచి టెస్టుల్లోకి ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్ కు మరోసారి వెన్నుముకగా నిలిచాడు. వన్డేల నుంచి టెస్టులకు ప్రమోట్ అయిన మరో ఆటగాడు షమి తానేంటో తొలి టెస్టులోనే నిరూపించుకున్నాడు. విండీస్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు లక్ష్యంగా 234 పరుగులు నిర్ధేశించింది. దానిని అందుకునే క్రమంలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో తడబడింది. నెమ్మదిగా తడబడుతూ ఆరంభమైన టీమిండియా బ్యాటింగ్ ను గాడిన పెట్టే బాధ్యత రోహిత్ శర్మ తనపై వేసుకున్నాడు.
అతనికి అశ్విన్ జతగా తిరుగులేని ఇన్నింగ్స్ తో మరో సెంచరీ సాధించి భారత ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చారు. క్రికెట్ పండితుల చేత ఆధునిక క్రికెట్ల్ అత్యద్భుతమైన టెక్నిక్ గల ఆటగాడిగా ప్రశంసలు పొందిన రోహిత్ శర్మ కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. రోహిత్ కెప్టెన్సీలో ఆడిన ఆటగాళ్లంతా టీమిండియాలో దూసుకుపోతుండగా రోహిత్ నిలకడ లేని ఇన్నింగ్స్ తో తనను తాను నిరూపించుకోలేకపోయాడు. సరిగ్గా ఇదే సమయంలో సచిన్ నిష్క్రమిస్తున్నాడన్న వార్త రోహిత్ కెరీర్ పై కూడా ప్రభావం చూపుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఈ దశలో జూలు విదిల్చిన రోహిత్ శర్మ విమర్శకుల విసుర్లకు సమాధానంలా వరుసగా ఉపయుక్తమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
తాజాగా అతను వరుస సెంచరీలతో భారత ఇన్నింగ్స్ కు వెన్నుముకగా నిలుస్తున్నాడు. మరో వైపు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ నుంచి వెలుగు చూసిన మరో సంచలనం మహ్మద్ షమి. సంచలనాలు లేకుండా, చక్కని లైన్ అండ్ లెంగ్త్, బౌలింగ్ లో ప్రాధమిక సూత్రాలను అమలు చేస్తూ పేస్ ను తనకు అనుకూలంగా మార్చుకుంటూ బ్యాట్స్ మన్ ను బొల్తా కొట్టించే బౌలర్ షమి. భారత బౌలింగ్ తాజా సంచలనం షమి టెస్టులో 9 వికెట్లు సాధించి తన సత్తా చాటాడు. దీంతో అరంగేట్రంలోనే రోహిత్ శర్మ, మహ్మద్ షమి అదరగొట్టారు.