: మందా, వివేక్ లను సస్పెండ్ చేసే దమ్ములేదా : సోమిరెడ్డి
కాంగ్రెస్ వ్యవహార శైలిపై తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎంపీలు మందా జగన్నాథ్, వివేక్ ఇద్దరూ తెరాసలో కీలక పాత్ర పోషిస్తుంటే... వారిని సస్పెండ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీలుగా ఎన్నికైన వారు... తెరాసలో రాజకీయాలు చేయొచ్చా? అని నిలదీశారు. సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్, వైసీపీలు చేతులు కలిపాయని... తెలంగాణలో కాంగ్రెస్, తెరాసలు కుమ్మక్కయ్యాయని విమర్శించారు. నిధులు, విధులు, నీళ్లపై స్పష్టత లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని నిలదీశారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో రాష్ట్రం కలిసుండాలనే కోరిందని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో విభజన చేయాలనుకుంటే... మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించిందని తెలిపారు.