: ఐదు వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్.. విండీస్ 148/5
భారత్ తో జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఐదో వికెట్ కోల్పోయింది. టీవిరామం తరువాత కాస్త స్వేచ్ఛగా ఆడిన విండీస్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. దీంతో వెస్టిండీస్ టాపార్డ్ కుప్పకూలింది. మరో మూడు రోజులు ఆట మిగిలుండగానే భారత జట్టు సచిన్ కు ఘనమైన కానుక ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. బ్రావో(37) ను అశ్విన్ బొల్తా కొట్టించగా, రామ్ దిన్ ను షమి దొరకబుచ్చుకున్నాడు దీంతో విండీస్ 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. క్రీజులో చందరపాల్(20), డారెన్ స్యామి(7) ఉన్నారు.