: రుణ మాఫీలో అవకతవకలు తేలితే కఠిన చర్యలు: ప్రధాని
పార్లమెంటును కుదిపేస్తున్న వ్యవసాయ రుణ మాఫీ అంశంపై ప్రధానమంత్రి మన్మోహన్ ఎట్టకేలకు స్పందించారు. రుణ మాఫీలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమన్నారు. రాజ్యసభలో జీరో అవర్ సందర్బంగా బీజేపీ నేత రవి ప్రసాద్ లేవనెత్తిన ప్రశ్నకు జవాబిస్తూ, రుణ మాఫీ అక్రమార్కులపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని హెచ్చరించారు.