: అవినీతి అంతానికి ఆయుధం ఆర్టీఐ : రాహుల్ గాంధీ


దేశంలో అవినీతిని అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ అనే అస్త్రాన్ని ఇచ్చిందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఛత్తీస్ గఢ్ లో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఉపాధి కోసం చాలా మంది ప్రజలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు తరలి వస్తున్నారని అన్నారు. చత్తీస్ గఢ్ లో జరిగిన మావోయిస్టుల దాడిలో అనేక మంది కాంగ్రెస్ నేతలు చనిపోయారని ఆయన గుర్తు చేశారు. రమణ్ సింగ్ ప్రభుత్వం అవినీతిలో ప్రపంచ రికార్డు సాధిస్తోందని విమర్శించారు. ప్రజల వల్లే అధికారం సాధ్యమని తాము నమ్ముతున్నామని, అయితే సీఎం వల్లే అది సాధ్యమని బీజేపీ అంటోందని రాహుల్ తెలిపారు. ఓటర్లే ఏది నిజమనేది నిర్ణయిస్తారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News