: దొడ్డి దారిలో బిల్లు తెచ్చేందుకు అధిష్ఠానం ప్రయత్నిస్తోంది : గంటా
రాష్ట్ర అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంతవరకు ఏ రాష్ట్రం ఏర్పడలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ అధిష్ఠానం దొడ్డి దారిలో తెలంగాణ బిల్లు తెచ్చే ప్రయత్నాల్లో ఉందని ఆరోపించారు. బిల్లు అసెంబ్లీకి వస్తే మెజారిటీ సభ్యులు వ్యతిరేకిస్తారని ఆయన స్పష్టం చేశారు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుందని అధిష్ఠానం తెలిపిందని... కానీ ఇంతవరకు పర్యటించలేదని ఆయన విమర్శించారు.