: ప్రేమించిన యువతిపై హత్యా యత్నం


ప్రేమించిన యువతి పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేసినందుకు ఆమెపై హత్యాయత్నం చేశాడో ప్రేమికుడు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లికి చెందిన నంబూరి గౌతిమి ప్రియాంక, అదే గ్రామానికి చెందిన అనుమకొండ ఈశ్వర్ రావు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండు నెలల క్రితం ఈశ్వర్ రావు వేరే యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. దీంతో ప్రియాంక అతనిని నిలదీసింది. పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎలాగైనాసరే ప్రియాంకను అంతమొందించేందుకు ఈశ్వర్ రావు పథకం సిద్ధం చేసి అమలు చేశాడు. ప్లాన్ ప్రకారం, బుధవారం రాత్రి ప్రియాంక బాత్రూంకి వెళ్తుండగా ముగ్గురు యువకులు ఇంటి గోడదూకి ఆవరణలో చొరబడ్డారు. వీరిలో ఒకరు వెనుక నుంచి ఆమె కళ్లు మూయగా, ఇంకొకరు ఆమె నోటికి గమ్ పేపర్ అడ్డం పెట్టారు. మరో వ్యక్తి ఆమె గొంతుకు నైలాన్ తాడుతో ఉరి వేసే ప్రయత్నం చేశాడు.

వారితో పెనుగులాటలో ఆమె ఆరుపులు విన్న ఆమె బాబాయి ఘటనా స్థలికి రావడంతో యువకులు ముగ్గురూ పరారయ్యారు. దీంతో ఆమెను 108లో ఆసుపత్రికి తరలిచారు. దీంతో అవనిగడ్డ సోషల్ యాక్షన్ కమిటీ అధ్యక్షురాలు, బాధితురాలిని పరామర్శించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చల్లపల్లి పోలీసులు బాధితురాలి వాగ్మూలం నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News