: కామన్ వెల్త్ సమావేశాన్ని బాయ్ కాట్ చేయండి: ప్రధానికి కరుణానిధి విజ్ఞప్తి
ఈ నెల పదిహేడున శ్రీలంక రాజధాని కొలంబోలో జరగనున్న కామన్ వెల్త్ దేశాల సమావేశానికి హాజరుకాకూడదంటూ ప్రధానమంత్రిపై ఒత్తిడి పెరిగింది. సమావేశాన్ని బహిష్కరించాలంటూ డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఈ విషయంపై పలుమార్లు పీఎంకు విజ్ఞప్తి చేస్తూ లేఖలు కూడా రాశారు. అయితే, ప్రధాని వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో... తమిళనాడులో కొంతమంది నిరసనకారులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ధర్నాలు కూడా చేశారు.