: రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నేత చంద్రబాబే : జేసీ ప్రభాకర్ రెడ్డి


జేసీ సోదరులు టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారనే విషయంలో మరింత క్లారిటీ వచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఈ వార్తలకు మరింత బలం చేకూరేలా వ్యాఖ్యానించారు. ఈ రోజు అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమం కోసం గతంలో తెదేపా చేపట్టిన కార్యక్రమాలను మెచ్చుకోక తప్పదని అన్నారు. చంద్రబాబుపై తనకు అపారమైన నమ్మకముందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నేత చంద్రబాబేనని చెప్పారు.

దీనికి తోడు, మహబూబ్ నగర్ లో జరిగిన వోల్వో బస్సు ప్రమాదంపై, సీఐడీ విచారణ చేపట్టడాన్ని ప్రభాకర్ రెడ్డి స్వాగతించారు. జబ్బార్ ట్రావెల్స్ కు తమ బస్సును లీజుకిచ్చిన వ్యవహారంపై స్పందిస్తూ... బస్సులను ఆర్టీసీ లీజుకిస్తే తప్పులేనప్పుడు... మేమిస్తే తప్పా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News