: చదువుకోనందుకు చింతిస్తున్న కరీనాకపూర్
చదువును నిర్లక్ష్యం చేసినందుకు కరీనాకపూర్ ఇప్పుడు చింతిస్తోంది. 'ఎవరికైనా సరే చదువే చాలా ముఖ్యం. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు చదువు ఎందుకులే అనుకున్నా. కానీ, బాగా చదువుకోనందుకు ఇప్పుడు విచారిస్తున్నా. కనీసం ఇంకాస్త బాగా చదువుకుని ఉండాల్సింది' అని కరీనా చెప్పింది. 2000లో 20వ ఏట రెఫ్యూజీ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన కరీనా ఇప్పటికీ సినిమాల్లో తీరిక లేకుండా నటిస్తోంది. అప్పుడెప్పుడో లా కోర్సు మొదలు పెట్టినా అది అర్ధంతరంగానే ఆగిపోయింది.