: నేడు ఎల్ కే అద్వానీ పుట్టిన రోజు.. శుభాకాంక్షలు తెలిపిన మోడీ
భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ క్రిష్ణ అద్వానీ 86వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన నివాసానికి చేరుకున్న పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ... పూల బొకేతో అద్వానీకి శుభాకాంక్షలు తెలిపారు. అటు మిగతా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా అద్వానీకి శుభాకాంక్షలు చెప్పారు.