: 453 పరుగులకు భారత్ ఆలౌట్
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా 453 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత జట్టుకు తొలి ఇన్సింగ్స్ లో 219 పరుగుల ఆధిక్యం లభించింది. రోహిత్ శర్మ(177), రవి చంద్రన్ అశ్విన్(124) ఇద్దరూ సెంచరీల మోత మోగించి రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత జట్టు ఆధిక్యం సంపాదించింది. శిఖర్ ధావన్(23), మురళీ విజయ్(26), పుజారా(17), సచిన్(10), ధోనీ(42)లు ఓ మోస్తరు స్కోరు సాధించినా రోహిత్, అశ్విన్ ల పట్టుదలతో భారత్ మెరుగైన ప్రదర్శన చేయగలిగింది. విండీస్ బౌలర్లలో షిల్లింగ్ ఫోర్డ్ 6, పెరమాల్ 2, బెస్ట్, క్రోటెల్ చెరో వికెట్ తీసుకోవడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.