: ఏడో వికెట్ కు రికార్డు భాగస్వామ్యం
విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ ఒక రికార్డును బద్దలుగొట్టారు. వీరిరువురూ భారత్ తరపున ఏడో వికెట్ కు 280 పరుగులు చేసి గత రికార్డును చెరిపేశారు. 2010 ఫిబ్రవరిలో ఇదే గ్రౌండ్ లో ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్ ఏడో వికెట్ కు 259 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటిదాకా భారత్ తరపున ఇదే అత్యధిక ఏడో వికెట్ భాగస్వామ్యం.