: ఖమ్మం జిల్లా మధిర శ్రీరామ్ చిట్స్ బ్రాంచిలో భారీ చోరీ
ఖమ్మం జిల్లాలోని మధిర శ్రీరామ్ చిట్స్ బ్రాంచిలో భారీ చోరీ జరిగింది. బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లినట్లు బ్రాంచి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.3 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.7 లక్షల నగదు చోరీ అయినట్లు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.