: ఎన్టీపీసీ మృతుల కుటుంబాలకు రూ. 45 లక్షల పరిహారం


కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నిన్న సాయంత్రం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తున్న ముగ్గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మరిణించిన వారి కుటుంబాలకు రూ. 45 లక్షలు (ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షలు) చెల్లించడానికి ఎన్టీపీసీ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఎన్టీపీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి తోడు, మృతుల కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు కార్మికునిగా ఉద్యోగం కల్పించేందుకు అంగీకరించింది.

  • Loading...

More Telugu News