: ఈ సైకిల్‌ తొక్కితే చాలు...


ఇదో కొత్త తరహా సైకిల్‌. ఈ సైకిల్‌ తొక్కడం వల్ల మనం ఉన్న చోటునుండి అంగుళం కూడా ముందుకు కదలం కానీ దీన్ని తొక్కడం వల్ల మన ల్యాప్‌ట్యాప్‌ రీచార్జ్‌ అవుతుంది. ఇలాంటి కొత్త రకం సైకిల్‌ను శాస్త్రవేత్తలు తయారుచేశారు.

పెడల్‌ చార్జర్‌ అనే పేరుతో ఉన్న ఈ కొత్త రకం సైకిలు పేరుకు తగ్గట్టుగానే తొక్కితే పెడల్‌కు ఉండే చక్రాలు కదిలి ముందుకు వెళ్లడం జరగదుకానీ చక్రాలు కదలడం వల్ల వాటికి అనుసంధానంగా ఉండే యంత్రం పనిచేయడం మొదలవుతుంది. దీనిద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తుతో మీ ల్యాప్‌ట్యాప్‌ చార్జింగ్‌ అవుతుంది. పిండిమర, నీటిపంపుల తయారీకి ఇలాంటి పరికరాలను ఇప్పటికే వాడుతున్నారు. ఇలాంటి పరికరాన్నే కాస్త మార్చి ఇలా ల్యాప్‌ట్యాప్‌ చార్జింగ్‌ మిషన్‌లాగా పరిశోధకులు తయారుచేశారు.

  • Loading...

More Telugu News