: విద్యుత్ కోతలను నిరసిస్తూ టీఎన్ టీయూసీ వినూత్న ప్రదర్శన
రాష్ట్రంలో విద్యుత్ కోతలకు నిరసనగా తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ వినూత్న ఆందోళన కార్యక్రమం చేపట్టింది. యూనియన్ కార్మికులు కళ్లకు నల్లటి వస్త్రాన్ని కట్టుకొని, చేతిలో ప్లకార్డులు పట్టుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మాట్లాడిన యూనియన్ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. కరెంటు కష్టాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే సర్కారు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఛార్జీలు, సర్ ఛార్జీలు అంటూ రేట్లు పెంచి ఇప్పుడు గంటల పాటు విద్యుత్ కోతలు విధించడం నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.