: అఖిలపక్ష సమావేశానికి ఒకరు లేదా ఇద్దరు రావొచ్చు: షిండే
ఈ నెల 12న జరిగే అఖిలపక్ష సమావేశానికి ప్రతి పార్టీ నుంచి ఒకరు లేదా ఇద్దరు రావొచ్చని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే అన్నారు. ప్రతి పార్టీకి 20 నిమిషాల సమయాన్ని కేటాయించామని చెప్పారు. ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర మంత్రులతో భేటీ అవుతామని తెలిపారు. కాగా, జీవోఎంకు 18వేల వినతి పత్రాలు అందాయని వెల్లడించారు.