: శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ తనిఖీలు
ఈరోజు, రేపు ఉగ్రవాద పేలుళ్లు జరగవచ్చని, జాగత్రగా ఉండాలన్న కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికతో హైదరాబాదులో అన్నిచోట్ల భ్రదత కట్టుదిట్టమైంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం) సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. విమానాశ్రయం చుట్టుపక్కల ఇప్పటికే గట్టి నిఘా వుంచిన పోలీసులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అణువణువు పరిశీలిస్తున్నారు.