: సమైక్య డిమాండులో ఎలాంటి మార్పు లేదు: శైలజానాథ్


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తమ డిమాండ్ లో ఎటువంటి మార్పు లేదని మంత్రి శైలజానాథ్ స్పష్టం చేశారు. అంతేకాక ఎలాంటి ప్యాకేజీలకు తాము అంగీకరించేది లేదన్నారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానం పిలిచిన సమావేశానికి వెళ్లడంలో తప్పేముందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన రోజు తన రాజకీయ జీవితంలో అత్యంత దురదృష్టకరమైన రోజుగా శైలజానాథ్ చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని గట్టిగా కోరుతున్నది సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తమ డిమాండ్ కి ప్యాకేజీలేవీ ప్రత్యామ్నాయం కాదని శైలజానాథ్ అన్నారు.

  • Loading...

More Telugu News