: మన సీవీ రామన్ 125వ జయంతి నేడు


నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు, తొలి ఆసియా వాసి మన సర్ సీవీ రామన్. కాంతి పారదర్శకమైన వస్తువు ద్వారా ప్రయాణిస్తున్నప్పుడు కొంత పరావర్తనం చెందినప్పుడు తరంగదైర్ఘ్యంలో మార్పులు ఉంటాయన్న ఆయన పరిశోధనకే నోబెల్ వరించింది. విఖ్యాత భౌతిక శాస్త్రవేత్తగా సీవీ రామన్ సుపరిచితులు. మద్రాస్ ప్రావిడెన్స్ లో తిరువనైకవల్ ప్రాంతంలో 1866లో చంద్రశేఖర అయ్యర్, పార్వతి అమ్మాళ్ దంపతులకు రామన్ జన్మించారు.

రామన్ తండ్రి విశాఖపట్నంలోని ఏవీ నరసింహారావు కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. విశాఖలో రామన్ పాఠశాల విద్య నడిచింది. మద్రాస్ లో బీఏ పూర్తి చేశారు. 1907లో ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ లో అసిస్టెంట్ ఆడిటర్ జనరల్ గా చేరారు. 1970 నవంబర్ 21న బెంగళూరులో మరణించారు. 1954లో భారతరత్న, 1957లో లెనిన్ శాంతి బహుమతులు రామన్ ను వరించాయి. ఈ రోజు రామన్ జయంతి సందర్భంగా గూగుల్ తన హోమ్ పేజీలో మాస్టారి ఫొటోతో డూడుల్ ను ప్రదర్శించింది.

  • Loading...

More Telugu News