: నిలదొక్కుకున్న భారత్... 150/5
ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మొదటి టెస్టులో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ నిలదొక్కుకుంది. ధోనీ (39 రన్స్, 5 ఫోర్లు), రోహిత్ శర్మ (28 రన్స్, 4 ఫోర్లు) ఇద్దరూ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ను నిర్మిస్తున్నారు. ఆరో వికెట్ కు వీరిద్దరూ 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం భారత్ 5 వికెట్ల నష్టానికి 150 పరుగులతో ఆడుతోంది.