: కరుగుతున్న రూపాయి
డాలర్ తో రూపాయి మారకం విలువ మళ్లీ క్రమంగా తరిగిపోతూ వస్తోంది. రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు డాలర్ తో రూపాయి మారకం 68 రూపాయలు ఉంది. ఆ తర్వాత ఆయన తీసుకున్న చర్యల పుణ్యమాని అప్పటి నుంచి రూపాయి విలువ క్రమంగా రికవరీ అవుతూ 61 రూపాయల స్థాయికి చేరుకుంది. మళ్లీ అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఈ రోజు కూడా 19 పైసల నష్టంతో 62.58 వద్ద ట్రేడ్ అవుతోంది.