: పార్టీలో వ్యక్తిగత ద్వేషాలు లేవు : తెదేపా ఎంపీ శివప్రసాద్


వారి ప్రాంత ప్రజల కోసం వారు మాట్లాడుతున్నారు... మా ప్రజల కోసం మేం మాట్లాడుతున్నామని తెదేపా ఎంపీ శివప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా చీడపురుగులున్నాయని... పయ్యావుల, కోడెలపై నిన్న టి.టీడీపీ నేత ఎర్రబెల్లి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా శివప్రసాద్, ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ఎవరిదీ తప్పులేదని తెలిపారు. ఇరు ప్రాంత నేతల మధ్య ఎలాంటి వ్యక్తిగత ద్వేషాలు లేవని అన్నారు. తండ్రిగా చంద్రబాబు... ఇరు ప్రాంతాల వారినీ సమన్వయం చేస్తున్నారని చెప్పారు. పార్టీలో చంద్రబాబు అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛను ఇచ్చారని తెలిపారు. వైసీపీలా టీడీపీ ఒక ప్రాంతానికే పరిమితం కాలేదని... ఇరు ప్రాంతాల్లో పార్టీని రక్షించుకోవడమే మా ధ్యేయమని అన్నారు. రాష్ట్ర విభజన కూడా ఆగిపోయే అవకాశం లేకపోలేదని శివప్రసాద్ చెప్పారు.

  • Loading...

More Telugu News